
కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లడమే బీఆర్ఎస్ నైజం…
హరీష్ రావు నోట ప్రతి రోజు అబద్దాలే…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే.చింతకుంట విజయ రమణారావు …
పెద్దపల్లి// తెలంగాణ అసెంబ్లీ సి ఎల్ పిl మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వవిప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు మాట్లాడుతూ….
కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం పై బురద జల్లడమే హరీష్ రావు పనిగా పెట్టుకున్నారని అన్నారు.
ప్రజలు ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నా బీఆర్ఎస్ కు మాత్రం జ్ఞానోదయం జరగడంలేదని విమర్శించారు. అసెంబ్లీలో తాము గొంతు నొక్కితే అసెంబ్లీ రికార్డుల ప్రకారం 4 గంటల16 నిమిషాలు ఎలా మాట్లాడారని విజయ రమణారావు హరీష్ రావును ప్రశ్నించారు.
హరీష్ రావు నిజాయితీ ఏమిటో ఈ లెక్కలే చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం అబద్దాలాడడంలోనూ దిగజారి పోయారని ఆయన వాక్యాన్నించారు. అబద్ధాలు ఆడితేనే బతికేస్తాయికి హరీష్ రావు చేరారని అన్నారు. అసెంబ్లీలో కేటీఆర్ 1 గంట 44 నిమిషాలు మాట్లాడారని వివరించారు. కేటీఆర్, హరీష్ రావులు ఇద్దరు కలిసి దాదాపు 6:00 గంటలు అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందని తెలిపారు.
కాంగ్రెస్ శాసనసభ్యులు, మంత్రులు, సీఎం కంటే మూడు గంటలు వీరే ఎక్కువగా మాట్లాడినట్టు అసెంబ్లీ రికార్డులే తెలుపుతున్నాయని విజయ రమణారావు గారు వెల్లడించారు. అయినప్పటికీ తమ గొంతు నొక్కారని బీఆర్ఎస్ నేతలు పేర్కొనడం వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నట్టు చెప్పారు.
అసెంబ్లీని గాంధీభవన్ గా మార్చారని అనడం నీతి బాహ్యమని విజయ రమణారావు మండిపడ్డారు. ప్రతిపక్షాలకే మూడు గంటలు ఎక్కువగా మాట్లాడే అవకాశం కల్పించడం రాష్ట్ర ప్రయోజనాల కోసమా.. లేక గాంధీభవన్ గా మార్చినట్టా.. ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు.
రోజు రాత్రి 10 నుండి అర్ధరాత్రి వరకు కూడా అసెంబ్లీ నడిచిన రోజులు ఉన్నాయని అన్నారు. ఇలా ప్రజా సమస్యల కోసం అసెంబ్లీని నడిపితే దిశా దశ లేని రీతిలో నడిపారని అనడం కేవలం ప్రభుత్వంపై బురద జల్లడమే అని పేర్కొన్నారు. అన్ని పద్దుల మీద సమగ్ర చర్చ జరిగిందని, అన్ని పద్ధులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడడం చివరలో వాకౌట్ చేసి వెళ్లిపోవడం ఆ పార్టీ ద్వంద వైఖరిని తెలియజేస్తుందని చెప్పారు.
గత 10 ఏళ్లలో అసెంబ్లీలో కెసిఆర్, కెటిఆర్ చేసిన ప్రసంగాలు కూడా ఎథిక్స్ కమిటీకి పంపాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఘోర ఓటమి చెందినప్పటికీ ఆ పార్టీకి జ్ఞానోదయం జరగడం లేదన్నారు.
సిట్టింగ్ జడ్జి లేదా హౌస్ కమిటీతో మైనింగ్ అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేయడంలో అర్థం లేదన్నారు. ముఖ్యమంత్రి సిబి సిఐడితో విచారణ జరిపిస్తామని ప్రకటించినప్పటికీ ఎందుకు అంగీకరించడం లేదని విజయ రమణారావు ప్రశ్నించారు. కవిత జైలులో ఉన్నప్పుడు బిజెపి నేతల కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీకి చెక్కర్లు కొట్టిన కేటీఆర్, హరీష్ రావులు ఈరోజు రాష్ట్రాన్ని 10 ఏళ్లపాటు దోచుకున్న ఆస్తుల పంపకంలో తేడాలు రావడంతో కొట్లాడుకుంటున్నారని చెప్పారు.
వీరి ధ్యాసంతా అక్రమార్చన కోసమే కానీ ప్రజల కోసం కాదని, ప్రజా ప్రయోజనాల కోసం కాదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం అంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసమే అసెంబ్లీని కుదించారని విమర్శించడం సబబు కాదన్నారు, గతంలో టిఆర్ఎస్ కంటే ఎక్కువగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాని దేనిని ఆయన స్పష్టం చేశారు.
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా అనగదొక్కారని అన్నారు. అప్పటి ప్రతిపక్ష నేత బట్టి విక్రమార్క కు ఆ హోదా దక్కకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దళితుడిని ప్రతిపక్ష నాయకుడుగా ఉండకుండా చేశారని, ఈరోజు అసెంబ్లీ స్పీకర్ దళితుడు అయినందుకే అసెంబ్లీ సమావేశాలను రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ విమర్శించారు. రానున్న రోజుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.