రొంపిచర్లలో 10 మందికి రౌడీషీట్లు రద్దు

TEJA NEWS

రొంపిచర్లలో 10 మందికి రౌడీషీట్లు రద్దు

రొంపిచర్ల పోలీస్ స్టేషన్ ను నరసరావుపేట డిఎస్పీ హనుమంతరావు నిన్న సందర్శించారు. స్టేషన్లోని రికార్డులు, శాంతిభద్రతల పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.స్టేషన్ పరిధిలో ఉన్న 26 మంది రౌడీషీటర్ల ప్రవర్తనను పర్యవేక్షించారు. వీరిలో కొంతకాలంగా ఎటువంటి నేరాలకు పాల్పడకుండా, సత్ప్రవర్తనతో ఉన్న 10 మందికి రౌడీషీట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చి మార్పును గమనించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top