కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ఎనిమిది రోజులుగా చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన నర్సారెడ్డి భూపతి రెడ్డి .
గత ఎనిమిది రోజులుగా కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసి లో విలీనం చేయాలని దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే గణేష్ కి సంఘీభావం తెలిపిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .
ఈ సందర్భంగా భూపతి రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్ లో నాలుగు లక్షలకి పైగా నివాసం ఉంటున్న ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోని కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుని రద్దు చేయాలని కోరుతూ ప్రజాపాలనతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా సంక్షేమాలని కంటోన్మెంట్ ప్రజలకు మరింత చేరువ కావాలంటే కంటోన్మెంట్ బోర్డు రద్దుకి తోడ్పడాలని, గత ప్రభుత్వం లాగా కేంద్ర ప్రభుత్వంతో అభివృద్ధి విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించాలని దానిలో భాగంగా కంటోన్మెంట్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ బోర్డుని తక్షణమే రద్దు చేయాలని కోరుకున్నారు. గతంలో సిటీకి దూరంగా కంటోన్మెంట్ ఉండేదని కానీ ఇప్పుడు కంటోన్మెంట్ సిటీలో ఒక ముఖ్య భాగంగా ఉందని దీనిని అభివృద్ధి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన బోర్డు రద్దుచేసి జిహెచ్ఎంసి లో విలీనానికి, కంటోన్మెంట్ అభివృద్ధికి తమ వంతు బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మైన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, కొంపల్లి మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, అంజి, సందీప్ పాల్గొన్నారు.
