ఘనంగా చదువుల తల్లి సావిత్రిబాయిపూలే 129వ వర్ధంతి వేడుకలు….

TEJA NEWS

ఘనంగా చదువుల తల్లి సావిత్రిబాయిపూలే 129వ వర్ధంతి వేడుకలు….

ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం.

పెద్దపల్లి //రామగుండం: అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఎల్కపల్లి సురేష్ అధ్యక్షత వహించగా ఏఐఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి లు ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే
భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని,రచయిత్రి,ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య అని, కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి,ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందని, కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారని ,నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందని. సమాజంలోని కులతత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరిని తరిమి కొట్టిందని,ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి ని అని ఆయన అన్నారు.సమ్మక్క- సారక్క,చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని, మహిళలు వంటింటికే పరిమితం కాదని,ఇంటికి పట్టిన బూజును ఎట్లా దులుపుతారో,దేశానికి పట్టిన మతోన్మాదాన్ని అట్లా దులపాలని ఆయన అన్నారు .

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు అనుప్ సాయి ,జశ్వంత్,అభిషేక్, చైత్ర, సాయి శరణ్య , అమీనా ,ప్రహర్షిని తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top