చేవెళ్ల నియోజకవర్గం పాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

TEJA NEWS

చేవెళ్ల నియోజకవర్గం పాస్టర్స్ నూతన కమిటీ ఎన్నిక

శంకర్‌పల్లి: చేవెళ్ల నియోజకవర్గంలో 1862/2016 అనే రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా 2016 సంవత్సరం నుండి 2020 నుండి 2026 వరకు రెండు దఫాలుగా కమిటీ కొనసాగుతూ వచ్చింది. ఈ కమిటీలో అధ్యక్షులు పి అబ్రహం, ఉపాధ్యక్షులు ఎం దానియేలు, కార్యదర్శి ఎంఎం సామ్యూల్, సహకార కార్యదర్శి అనంతరావు, జేమ్స్, సలహాదార్లు ఎస్ సంజీవరావు, జి సామెల్, ఐదు మండలాల కమిటీలు కలిసి చేవెళ్ల నియోజకవర్గం పాత కమిటీ వారి ఆధ్వర్యంలో నూతన కమిటీని నిర్వహించారు. నూతన కమిటీలో అధ్యక్షులుగా పాస్టర్ ఆసాపు(చేవెళ్ల), ఉపాధ్యక్షులు అనంతరావు జేమ్స్ (నవాబ్ పేట్ ), కార్యదర్శి రాజేందర్ (షాబాద్), సహకార కార్యదర్శి ప్రేమానందం (శంకర్‌పల్లి), కోశాధికారి మల్లేశం (ఇస్సాకు)(మొయినాబాద్) సలహాలు దార్లు కృష్ణ (నవాబుపేట్), యాదయ్య (షాబాద్ ), సంజీవ (శంకర్‌పల్లి) సామెల్ (శంకర్ పల్లి), దానియేలు (చేవెళ్ల) లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఈ కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులు సీనియర్ పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top