చేవెళ్ల నియోజకవర్గం:-
అర్హులందరికీ ఇందిరా మహిళా చీరలు అందిస్తాం:- చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .
నవాబ్ పేట్ మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో “మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి” పేరిట డ్వాక్రా సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” .
ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, వెలుగు ప్రార్థనను ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇందిరా మహిళా శక్తి కింద రాష్ట్ర ముఖ్యమంత్రి “ఎనుముల రేవంత్ రెడ్డి” రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
