వడ్డే లక్ష్మయ్య కుటుంబానికి చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య రూ. 5 లక్షల రైతు బీమా చెక్కు అందజేత

TEJA NEWS

వడ్డే లక్ష్మయ్య కుటుంబానికి చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య రూ. 5 లక్షల రైతు బీమా చెక్కు అందజేత

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపాల్టీ గణేష్ నగర్ కాలనీకి చెందిన వడ్డే లక్ష్మయ్య ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రత్యేక చొరవ తీసుకుని, ప్రమాద రైతు బీమా పథకం కింద రూ. ఐదు లక్షలను మంజూరు చేయించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా చెక్కును స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే యాదయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి అశోక్ కుమార్, చంద్రమౌళి, మల్లికార్జున్, మాజీ వార్డు సభ్యుడు మధు, పూర్ణ, శ్రీనివాస్ ఉన్నారు.

You cannot copy content of this page

Scroll to Top