చెవిరెడ్డి హడావుడి – తేలుకుట్టిన దొంగ !

TEJA NEWS

చెవిరెడ్డి హడావుడి – తేలుకుట్టిన దొంగ !

లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన వారితో పోలిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హంగామా ఎక్కువగా ఉంది. ఆయనను బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి పట్టుకొచ్చిన తర్వాత విజయవాడలో అరుపులు, కేకలతో హోరెత్తించారు. పోలీసు విచారణలోనూ అదే చేశారు. కామెడీ ఏమిటంటే.. పోలీసులు ప్రశ్నించి ఆయన ఇచ్చిన సమాధానాలను రికార్డు చేసిన తర్వాత.. ఆ పత్రాలపై సంతకాలు పెట్టమంటే వాటిని చించేశారు. తానేదో గొప్ప పని చేస్తున్నానని ఆయన అనుకున్నారు కానీ.. తర్వాత కోర్టులో అసలు విషయం చెవిరెడ్డికి బోధపడింది.

అన్నీ రికార్డు చేసి కోర్టుకు ఇచ్చిన పోలీసులు

చెవిరెడ్డి వ్యవహారాలన్నింటిని పోలీసులు రికార్డు చేశారు. విచారణ సమయంలో పోలీసులతో ఆయన వ్యవహరించిన తీరు, దర్యాప్తులో ఆయన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తీరు, తర్వాత పోలీసులు ఇచ్చిన పేపర్లను చించేయడం, పోలీసులపై కేకలేయడం మొత్తం రికార్డు చేశారు. జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దొరికిపోయిన దొంగలు చేసే హడావుడిపై అందరికీ ఓ అవగాహన ఉంటుంది. దాంతో పెద్దగా ఆలోచించకుండానే ఆయనకు రిమాండ్ పడిపోయింది. వాదించడానికి పొన్నవోలు అక్కర్లేదని అనుకున్నారేమో కానీ సొంత వాదనలు వినిపించారు.

ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ బాధ్యత చెవిరెడ్డిదే

ఎన్నికల సమయంలో ఓ లారీలో తరలిస్తున్న ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు దొరక్కపోతే చెవిరెడ్డికి సమస్య ఉండేది కాదు. అప్పటికి హైదరాబాద్ నుంచి రాష్ట్రం మొత్తం నగదు బట్వాడా చేసిన ఆయన .. తాను పోటీ చేస్తున్న ఒంగోలుకు తరలించుకునే సమయంలోనే దొరికిపోయారు. అక్కడ తీగ లాగితే మొత్తం రాష్ట్రం ఎంతెంత నగదు బట్వాడా అయిందో.. అది ఎక్కడి నుంచి వచ్చిందో.. వాటిని తరలించడానికి గన్‌మెన్లను ఎలా వాడుకున్నారో మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన తప్పించుకునే అవకాశాలు లేవు.

తెలంగాణ ఎన్నికల సమయంలోనూ అదే పని

చెవిరెడ్డి అసలు చేసే వ్యాపారాలేంటో బయటకు రావాల్సి ఉంది. ఎగుమతి , దిగుమతి వ్యాపారాలు చేస్తానని అందుకే శ్రీలంక పోతున్నానని ఆయన చేస్తున్నారు. ఆయన చేసే ఎగుమతి రెడ్ శాండల్ అని చాలా మంది అనుమానం. ఆ విషయంలోనూ ఆయన లెక్కలు తీయాల్సిన అవసరం కనిపిస్తోంది. చెవిరెడ్డి వందల కోట్లను విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్ కు ఆయన పని చేశారు. వారి ఆర్థిక అవసరాలనూ ఆయనే చూశారని చెబుతూంటారు. సర్వేలను చేయించారని అంటారు. ఇప్పుడు లెక్కలు తేలాల్సిన సమయం వచ్చింది. అందుకే.. దొరికిన దొంగలా చెవిరెడ్డి హడావుడిచేస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top