పేదల ప్రజల పాలిట వరంగా ముఖ్యమంత్రి సహాయనిధి…
బాధిత కుటుంబానికి రూ.2,50,000/-ల LOC కాపీనీ వారి కుటుంబసభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు ..
ఆపధకాలంలో అండగా నిలిచిన ఎమ్మెల్యేనాగరాజు కి కృతజ్ఞతలు తెలిపిన శ్రీపతి సంపత్ కుటుంబ సభ్యులు..
హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ నందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ పరిధిలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రీపతి సంపత్ అనారోగ్య సమస్య తో బాధపడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి నుంచి రూ.2,50,000 (2లక్షల 50వేల రూపాయలు) ఎల్ఓసి కాపీనీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రత్యేక చొరతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి లో చికిత్స కోసం శ్రీపతి సంపత్ కుటుంబ సభ్యులకు LOC కాపీనీ అందజేశారు….
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరుపేదలకు వైద్య విషయంలో అన్ని విధాలుగా అండగా ఉంటుందని, స్థానిక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన అనారోగ్య సమస్యల పట్ల నా వంతు సహాయ సహకారం అందించే కృషి చేస్తానని తెలిపారు…
నా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలందరికి విజ్ఞప్తి లక్షల రూపాయలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆసుపత్రిల దోపిడికి గురై అప్పుల పాలు కావద్దు విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ నిమ్స్ హాస్పిటల్ వెళ్లి నేను ఇచ్చే ఎల్వోసీ ద్వారా ఉచిత చికిత్స పొందాలనీ ఈ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే నాగరాజు విజ్ఞప్తి చేశారు…
ఈ సందర్బంగా బాధిత కుటుంబ సభ్యులు శ్రీపతి సంపత్
కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే నాగరాజు కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి, తమ కృతజ్ఞత భావాన్ని చాటుకున్నారు…..
ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు జక్కుల సదానందం, సతీష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు…
