చిలకలూరిపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం.

TEJA NEWS

చిలకలూరిపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశం.

దివంగత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఘన నివాళి..

చిలకలూరిపేట: స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని ఘనంగానిర్వహించారు. అయితే, ఈ సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవలగుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ రమణారావు మృతికి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, కౌన్సిలర్లు మరియు అధికారులు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ అందరూ కలిసి సంతాపం ప్రకటించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు మాట్లాడుతూ రమణారావు సేవలను కొనియాడారు. రమణారావు అత్యంత నిబద్ధత గల అధికారి అని, మున్సిపాలిటీ అభివృద్ధిలో మరియు పారిశుధ్య నిర్వహణలో ఆయన పాత్ర మరవలేనిదని గుర్తు చేసుకున్నారు. ఆయన అకాల మరణం పురపాలక సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు మరియు అధికారులు రమణారావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సంతాప కార్యక్రమం ముగిసిన తర్వాత సభ బడ్జెట్ అంశాలపై చర్చను కొనసాగించింది.

You cannot copy content of this page

Scroll to Top