చిరంజీవి మృతి బాధాకరం:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

TEJA NEWS

చిరంజీవి మృతి బాధాకరం:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

కోదాడ సూర్యపేట జిల్లా): కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామానికి చెందిన బలుగూరి చిరంజీవి మరణం బాధాకరమని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ లు అన్నారు.చిరంజీవి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బలుగూరిచిరంజీవి అంత్యక్రియలలో స్వేరో వ్యవస్థాపక అధ్యక్షులు,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని చిరంజీవి భౌతిక దేహం పై పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.అనంతరం కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి సంతాపాన్ని తెలిపారు.అంత్యక్రియలలో ప్రత్యేకంగా పాల్గొని ఇద్దరు నాయకులు చిరంజీవి పడెను మోసి కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు భార్య,సంధ్య,అన్నలు బల్గూరి కాశయ్య,మైసయ్య,దుర్గయ్య పిడమర్తి వెంకటేశ్వర్లు,మాతంగి ప్రభాకర్ రావు, అంకుల్ సార్, పిడమర్తి గాంధీ పిడమర్తి దశరథ, ఇమ్రాన్ ఖాన్, బండి మధు,ఎమ్మార్పీఎస్ లీడర్ ఏపూరి రాజు, రాము , రవి, పిడమర్తి వెంకట్రావు స్వేరోస్ రాష్ట్ర నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top