భక్తి ప్రపత్తులతో నగర సంకీర్తన

TEJA NEWS

భక్తి ప్రపత్తులతో నగర సంకీర్తన

తిరుపతి: ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మార్మోగుతున్నాయి.. శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. వందమందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం ఐదు గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు మంగళ వాయిద్యాలు నడుమ తిరు వీధులలో నగర సంకీర్తన చేస్తు నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు.

నగర సంకీర్తన అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నగర సంకీర్తన మండలి సభ్యులు సుబ్రహ్మణ్యం జన్మదిన సందర్భంగా ఆయనను దుశ్శాలువాతో సత్కరించి నగర సంకీర్తన మండల సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో సుబ్రహ్మణ్యం మరెన్నో జన్మదినాలు జరుపుకునేలా సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, కొండే చెంగారెడ్డి, మునినాథరెడ్డి, భాస్కరాచారి, మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం, అన్నూరు మునిరత్న మాచారి, మధు, విక్రమ్ స్వామి, బ్రహ్మానందం, పద్మావతి, సిద్ధమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర రెడ్డి, పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top