పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం

TEJA NEWS

పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం

** మున్సిపల్ కార్యక్రమంలో “శాప్” చైర్మన్ రవినాయుడు

తిరుపతి: మనుషులు తమను తామే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవినాయుడు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర లో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రవినాయుడు పాల్గొన్నారు. ఇందులో భాగంగా బీట్ ధ హీట్ నినాదంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎండ తీవ్రతలను తగ్గించేలా మొక్కలు నాటడం, చలివేంద్రాలు ఏర్పాటు, పశు పక్ష్యాదులకు నీటి తొట్టెల ఏర్పాటు, పారిశుద్ధ్య కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడం, టోపీలను అందజేశారు. ప్రజలు, ఉద్యోగులు అందరూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర లో భాగంగా నాలుగు నెలల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ అన్నారు.

అందులో భాగంగానే ఈనెల బీట్ ధ హీట్ నినాదంతో ఎండ వేడిమి నుండి ఉపశమనం కలిగేలా పలు కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. వేడి పెరగకుండా మొక్కలు నాటడం, రూఫ్ టాప్ గార్డెనింగ్ తదితర కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని అన్నారు. నగరంలో ఎండ వేడిమి నుండి రక్షణ పొందేలా మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ మునికృష్ణ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బ తినకుండా మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ ఊకా విజయకుమార్, కార్పొరేటర్లు అన్నా అనిత, రేవతి, ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతి నాయుడు, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top