
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువు వాకింగ్ ట్రాక్ శుద్ధి కార్యక్రమాన్ని GHMC శానిటేషన్ విభాగానికి చెందిన ఏఈ, డిఈ మరియు శానిటేషన్ ఇన్‌స్పెక్టర్, సమీప కాలనీల ప్రజలు, వాకర్స్ తో కలసి పరిశీలించి, లుక్స్ గ్లోబల్ ఫౌండేషన్ మరియు ఒరాకిల్ వాలంటీర్స్ సంయుక్తంగా వాకింగ్ ట్రాక్ శుద్ధి కార్యక్రమం చేస్తున్న వారిని అభినందించిన హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ మాట్లాడుతూ, వాకింగ్ ట్రాక్ శుభ్రంగా ఉంటే, నడకకు వచ్చే వారికి ఆహ్లాదకరమైన మరియు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది.
ఇది శ్వాసకోస సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. పేరుకుపోయిన చెత్తను తొలగించడం వల్ల దోమలు, ఈగలు మరియు ఇతర కీటకాలు వ్యాపించకుండా ఉంటాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది, ట్రాక్ మీద ప్లాస్టిక్ వ్యర్థాలు, రాళ్లు లేదా ఇతర అడ్డంకులు లేకపోతే నడిచేటప్పుడు పడిపోయే ప్రమాదం ఉండదు, ముఖ్యంగా వృద్ధులకు ఇది చాలా ముఖ్యం. ఆహ్లాదకరమైన మరియు నీటుగా ఉన్న పరిసరాలు ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వ్యర్థాలు నీటిలో కలవకుండా ఉండటం వల్ల చెరువులోని జీవరాశులు సురక్షితంగా ఉంటాయి మరియు భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ డిఈ శంకర్ గణేష్, ఏఈ బంసి పాటిల్, SRP సత్యనారాయణ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, సమీప కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.