శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండ లో గల CMC ఎనక్లేవ్

TEJA NEWS

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండ లో గల CMC ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.దీనిపై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగినది.

ఈ సందర్భంగా CMC ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు మాట్లాడుతూ కాలనీ లో మౌలిక వసతులు కలిపించినదుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అని అదేవిధంగా కాలనీ లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల ను వేయాలని మరియు అసంపూర్తిగా మిగిలిపోయిన UGD పనులు చేపట్టాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చలని, విధి దీపాలను వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వాటర్ ట్యాంకర్ల తో కాలనీ లో ఏర్పడిన ట్రాఫిక్ సమస్య ను పరిష్కరించాలని PAC చైర్మన్ గాంధీ ని వినతి పత్రం ద్వారా కోరడం జరిగినది.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ త్వరలోనే కాలనీ లో పర్యటిస్తానని, CMC ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను, UGD, పనులు అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్ని రోడ్ల ను దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
అసంపూర్తిగా మిగిలిపోయిన UGD, రోడ్ల పనులు వెంటనే చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగేలా చూడలని అధికారులకు తెలియచేసారు.

మంచి నీటి సరఫరా లో అంతరాయం లేకుండా మెరుగైన మంచినీటి సరఫరా చేయాలని, అవసరమున్న చోట మంచి నీటి సరఫరా సమయం పెంచాలని , తక్కువ ప్రెజర్ తో వచ్చే చోట తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ జలమండలి అధికారులకు తెలియచేసారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు తెలియచేసారు . అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే గాంధీ
తెలియచేసారు.

కాలనీ లో నిత్యం తిరుగుతున్న ట్యాంకర్ల వలన ఏర్పడిన ట్రాఫిక్ సమస్య ను పరిష్కరిస్తామని, రోడ్ల పై నిలిపి కాలనీ వాసులకు, పాదచారులకు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, కాలనీ లో ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.

You cannot copy content of this page

Scroll to Top