కేసారం గ్రామంలో కలేక్టర్ విస్తృత పర్యటన
24 షాప్ నెంబర్ చౌక దుకాణాన్ని పరిశీలన
పల్లె దావఖానా ఆకస్మిక తనకి
రెవెన్యూ సదస్సు జరుగుతున్న తీరును పరిశీలన
సూర్యాపేట : సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో చౌక దుకాణం, అంగన్వాడి కేంద్రం, పల్లెదవాఖానలను కలెక్టర్ తేజస్ ఆకస్మికంగా పరిశీలించారు. గ్రామంలోని రైతు వేదికలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని 24వ నెంబర్ చౌకధుఖాన్ని కలేక్టర్ పరిశీలించారు. సన్న బియ్యం పంపిణీ వివరాలను డీలర్ గొర్ల గన్నారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. షాపులో మొత్తం 735 రేషన్ కార్డులు ఉన్నాయని డీలర్ కలెక్టర్కు వివరించారు. జిల్లాలో ఉన్న 610 రేషన్ దుకాణాలకు 17,577 ఎంటిఎస్ ల సన్న బియ్యం పంపిణీ కొరకు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం కేసారం గ్రామంలోని రైతు వేదికలో జరుగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సులో రైతుల కొరకు ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ దరఖాస్తుల స్వీకరణ కేంద్రం కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా గ్రామస్థాయిలో రెవెన్యూ సంబంధించి భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సంస్థలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్ 20వ తేదీ వరకు కొనసాగే ఈ రెవెన్యూ సదస్సులలో రైతులు పాల్గొని తమ భూ సమస్యలను పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ భూభారతిలో అధికారులే రెవెన్యూ గ్రామాలకు వెళ్లి గ్రామ సభలు నిర్వహిస్తున్నారని ,సమస్యలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో ఏ సమస్య వచ్చినా జిల్లా కలెక్టర్ వద్దకు వచ్చేవారిని ఈ కొత్త చట్టంలో తాసిల్దార్ వద్దనే ఎన్నో సమస్యలు పరిష్కరించే విధంగా చట్టం రూపొందించబడిందని కలెక్టర్ పేర్కొన్నారు. మీ సమస్యపై దరఖాస్తు ఇచ్చేటప్పుడు దాని సంబంధించిన పూర్తి వివరాలను కూడా సమర్పించాలని కలెక్టర్ కోరారు. దరఖాస్తు ఇచ్చిన తర్వాత జరురుగా రసీదును తీసుకొని వెళ్లాలని రైతులకు కలేక్టర్ సూచించారు. రైతు సమస్యలపై విచారణ కొరకు గ్రామాలకు వచ్చిన రెవెన్యూ అధికారులను రైతులు పూర్తిగా సహకరించాలని కలెక్టర్ కోరారు. గ్రామాలలో క్షేత్రస్థాయిలో ఉన్న భూమి యొక్క పూర్తి వివరాలు పుస్తకాలలో ఉండేటట్లుగా భూభారతి తోడ్పడుతుందని కలెక్టర్ తెలిపారు.
అనంతరం రైతు సదస్సుకు వచ్చిన ఉప్పుల లింగయ్య సమస్యను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు . రైతు వేధికకు పక్కనే ఉన్న కేసారం సెకండ్ కాలనీ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణుల సంఖ్య, బాలింతల సంఖ్య, పిల్లల వివరాలను అంగన్వాడి టీచర్ చింత సుధాదేవిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ వేస్తున్నారా లేదా అంగన్వాడి టీచర్ను అడిగారు, అంగన్వాడీ కేంద్రాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని మంచి అహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు విద్యను అందించాలన్నారు,
అనంతరం పల్లె దవాఖాన ను కలెక్టర్ తేజస్ ఆకస్మికంగా సందర్శించారు. మందుల రిజిస్టర్ను, హాజరు పట్టికను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీల వివరాలు ఏయన్సి రిజిస్టర్లలలొ నమోదు చేశారా లేదా పరిశీలించారు. సకాలంలో మందులు , గర్భిణీలకు ఐరన్ టాబ్లెట్స్ వారు తీసుకోవలసిన ఆహార విషయాలను ,గర్భిణీలకు వివరించాలన్నారు. పల్లె దవాఖానాలోని సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. వైద్యసిబ్బంది ప్రజలకు సేవే ధర్మంగా విధులు నిర్వహించాలన్నారు. అన్ని రకాల మందులు స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఆకస్మిక పర్యటనలు కలెక్టర్ వెంట ఆర్డిఓ వేణుమాధవ్, తాసిల్దార్ కృష్ణయ్య, ఆర్ఐ శ్రీధర్, పల్లె దవాఖాన సూపర్వైజర్ విజయలక్ష్మి, ఐఎన్ఎం ఉపేంద్ర, అధికారుల సిబ్బంది పాల్గొన్నారు.
