కొంపల్లి డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు

TEJA NEWS

కొంపల్లి డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన BRS నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ మరియు మాజీ ప్రెసిడెంట్ ఆలూరి వెంకట శేషాచారి

డివిజన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఉమ్మడి సుభాష్ నగర్ డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దాలని డిప్యూటీ కమిషనర్లు కోరిన గుబ్బల లక్ష్మీనారాయణ

కుత్బుల్లాపూర్ సర్కిల్ గా ఉండే డివిజన్లు పునర్విభజనలో భాగంగా ఇప్పుడు కొంపల్లి సర్కిల్ గా ఏర్పాటు అవడంతో కొంపల్లి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణా రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి
అలాగే ఎస్సార్ నాయక్ నగర్ లో ghmc పార్కుకు సంబంధించి సమస్యలు ఉన్నాయని అందులో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఆలూరి వెంకట శేషాచారి గుబ్బల లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. అలాగే పారిశుధ్య సమస్యలను పరిష్కరించాలని ఎస్సార్ నాయక్ నగర్ తో పాటు పలు బస్తీలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కాలనీలో పర్యటించి సమస్య పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిషోర్ ,గోవిందస్వామి,సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top