పదవ తరగతిలో ప్రతిభ, విద్యార్థి సంతోష్ కుమార్‌కు అభినందనలు

TEJA NEWS

పదవ తరగతిలో ప్రతిభ, విద్యార్థి సంతోష్ కుమార్‌కు అభినందనలు

చిలకలూరిపేట: ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో పట్టణానికి చెందిన అన్నపురెడ్డి సంతోష్ కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచారు. సంతోష్ కుమార్ మొత్తం 521 మార్కులు సాధించి తన సత్తా చాటారు. ఈ సందర్భంగా విద్యార్థి తన తండ్రితో కలిసి ప్రదాత మండలనేని చరణ్ తేజ గారిని వారి కార్యాలయంలోమర్యాదపూర్వకంగా కలిశారు.సంతోష్ కుమార్ సాధించిన ఈ విజయానికి అభినందనలు తెలుపుతూ, చరణ్ తేజ విద్యార్థిని ప్రత్యేకంగా సత్కరించారు. విద్యార్థి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. చదువు పట్ల సంతోష్ కుమార్ చూపిన శ్రద్ధ, క్రమశిక్షణ ఇతర విద్యార్థులకు ఆదర్శమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమను ఆదరించి అభినందించినందుకు విద్యార్థి మరియు వారి తండ్రి చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top