కాంగ్రెస్ బాకీ కార్డు లక్ష్యం – ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తెలియజేయడం

TEJA NEWS

కాంగ్రెస్ బాకీ కార్డు లక్ష్యం – ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తెలియజేయడం .. మోసాలను నిలదీయడం
వాకిటి శ్రీధర్ బారసా జిల్లా అధికార ప్రతినిధి

వనపర్తి :
కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసింది. రైతులు, విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చాలా వరకు అమలు కాలేదు. అందుకే ఈ “కాంగ్రెస్ బాకీ కార్డు” కార్యక్రమం ద్వారా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాకీ హామీల గురించి స్పష్టమైన అవగాహన కల్పించాలి.

ప్రతి ఇంటికి బాకీ కార్డులను పంపిణీ చేసి, కాంగ్రెస్ చేసిన మోసాలను, ఇంకా నెరవేరని హామీలను ప్రజలకు వివరించాలి. గ్రామంలో మరియు పట్టణ వార్డులో ప్రతి ఇంటికి చేరడం ద్వారా ప్రజలు నిజమైన సమాచారం తెలుసుకుని భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని పొందుతారు.

ప్రతి ఇంటికి బాకీ కార్డులను పంపిణీ చేయడం మన ప్రధాన లక్ష్యం.

You cannot copy content of this page

Scroll to Top