కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్ట్ లకు ఇండ్లు కేటాయించాలి:
బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ కుమ్మరి సిద్దిరాములు
….
టేక్మాల్ :
రాష్ట్రంలోని జర్నలిస్టులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే వారికి ఇండ్లు కేటాయించాలని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు కుమ్మరి సిద్దిరాములు డిమాండ్ చేశారు. పత్రికా రంగం ప్రజల గొంతు అని, వారి సేవలను గౌరవించే విధంగా ప్రభుత్వం ప్రవర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.
“ప్రజల సమస్యలు అధికారులకు తెలియజేసే పాత్రలో జర్నలిస్టులు ఎప్పుడూ ముందు ఉంటారు. కానీ వారి పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. కొందరికి తలకు పైకప్పు కూడా లేదు. ప్రభుత్వం సానుభూతితో స్పందించి, ప్రతి జిల్లాలో జర్నలిస్టులకు ఇండ్లు కేటాయించే విధంగా ఒక ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలి అని సిద్దిరాములు పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి మరియు సమాచార శాఖ మంత్రులకు వినతిపత్రం పంపే ప్రక్రియను కూడా త్వరలో చేపట్టనున్నట్లు ఆయన తెలియజేశారు. జర్నలిస్టులు చేసిన సేవలకు గుర్తింపు ఇచ్చే సందర్భం ఇది అని, ప్రభుత్వం ముందడుగు వేయాలని సిద్దిరాములు కోరారు. తమ పార్టీ జర్నలిస్టుల పక్షాన నిలుస్తుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
