“ఓవర్ లోడ్” ఆటోలను నియంత్రించండి

TEJA NEWS

“ఓవర్ లోడ్” ఆటోలను నియంత్రించండి

** బీజేపీ సీనియర్ నేత నవీన్ కుమార్ సూచన
……

తిరుపతి: తిరుపతిలో ఆర్.టీ.ఓ అధికారులు మోటార్ వెహికల్ యాక్ట్ ను కఠినంగా అమలు చేసి…
వర్షాల కారణంగా నగరంతో పాటు పరిసర ప్రాంతాలలోని రహదారులపై ఏర్పడిన “గుంతలకు” నగరపాలక సంస్థ, ఆర్.అండ్.బి అధికారులు వెంటనే “ప్యాచ్ వర్క్” లు పూర్తి చేసి ఓవర్ లోడ్ ఆటోలను నియంత్రించాలని బీజేపీ సీనియర్ నేత అండ్ సోషియల్ యాక్టీవిస్ట్ అయిన పి.నవీన్ కుమార్ రెడ్డి విన్నవించారు. సాయంత్రం ఆయన తిరుపతిలోని వీవీ మహల్ రోడ్డులోగల తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
తిరుపతి జిల్లా ఎస్పీకి, ఆర్టీవో, నగరపాలక సంస్థ, ఆర్.అండ్.బి అధికారులకు బిజెపి నేత విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తిరుపతి ఆధ్యాత్మిక నగరం దినదినాభివృద్ధి చెందుతున్న కారణంగా పరిసర ప్రాంతాలలోని గ్రామాల నుంచి ప్రతి నిత్యం నగరానికి వేలాది మంది వివిధ వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ రద్దీ అనూహ్యంగా పెరిగిందన్నారు. నగరానికి పరిసర ప్రాంతాలలోని గ్రామ ప్రజలు ప్రతి నిత్యం విద్య, వైద్యం, వ్యాపారం, సొంత పనులతో పాటు ఇతరత్రా పనుల మీద తిరుపతికి రావాలంటే సకాలంలో బస్సు సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువ శాతం ప్రజలు ద్విచక్ర వాహనాలు…ఆటోలతో పాటు “షేర్ ఆటో”లపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. గతంలో ఉన్న “టౌన్ సర్వీస్ బస్” లు ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యాయని, ఆటోలే ప్రజలకు… యాత్రికులకు ప్రతినిత్యం అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో నగరంలో కొన్ని సందర్భాలలో “ఓవర్ లోడ్” తో షేర్ ఆటోలు దర్శనమిస్తున్నాయి. ఆటో డ్రైవర్ కి ఇరువైపులా ఇద్దరు వ్యక్తులను కూర్చోబెట్టుకొని వేగంగా నడపడం రోడ్డుకి ఇరువైపులా ఏ వాహనం క్రాస్ చేసి వెళ్తుందో కూడా కనిపించే అవకాశం లేకుండా వెళ్తున్నారన్నారు. ఇలాంటివి అత్యంత ప్రమాదకరం అని నవీన్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో నగర ప్రజలకు, యాత్రికులకు, స్కూల్ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా అందుబాటులో ఉన్న ఆటోలను, షేర్ ఆటోలను యదావిధిగా కొనసాగిస్తూ
“ఓవర్ లోడ్”
“ఓవర్ స్పీడ్” ఆటోలపై ప్రమాదాలు జరగకముందే అధికార యంత్రాంగం ప్రత్యేకంగా “ఓ లుక్” వేయాలని నవీన్ విజ్ఞప్తి చేశారు.

You cannot copy content of this page

Scroll to Top