పేదవాడు జీవించే హక్కును కాలరాస్తున్న కార్పొరేట్ మెడికల్ మాఫియా …జి.ఈశ్వరయ్య

TEJA NEWS

పేదవాడు జీవించే హక్కును కాలరాస్తున్న కార్పొరేట్ మెడికల్ మాఫియా …జి.ఈశ్వరయ్య

   దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్ మాఫియా ప్రజల జీవించే హక్కుపై పరోక్ష దాడి కొనసాగిస్తోంది. నాణ్యతలేని, బోగస్ మందులు విచ్ఛలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో మెడికల్ మాఫియా పై ఉక్కుపాదం మొపెందుకై భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఈ రోజు రాష్ట్రవ్యాప్త ఆందోళలకు పిలుపునిచ్చిన సందర్భముగా. సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన గాంధీనగర్ ధర్నా చౌక్ లో ఈ రోజు జరిగిన ధర్నా కార్యక్రమానికి హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ప్రాథమిక నినాదాలైన విద్య, వైద్యం, ఉద్యోగం,ఉపాధి, ఆవాసం వంటి ప్రాథమిక మౌలిక వసతులను పేదవానికి దూరం చేస్తూ ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ రోజు సామాన్యుడు సంపాదించే ప్రతి రూపాయితో 75 పైసలు విద్య, వైద్యానికే వచ్చిస్తున్నారని అటువంటి తరుణంలో రాష్ట్రములో పేదవాడు కనీస వైద్యం అందక జీవించే హక్కును కోల్పోతున్న పరిస్థితి నెలకొన్నది అని ఎద్దేవా చేసారు. రాష్ట్రములో కార్పొరేట్ వైద్యరంగం మాఫియాగా మారి ఈ రోజు ప్రభుత్వాన్ని సైతం నియంత్రించి పేదలకు కనీస వైద్యం అందానివకుండా అడ్డుపడుతూ వారి కార్పొరేట్ వైద్య వ్యాపారాన్ని విస్తరిస్తుంది అని, ఒక పక్క వామపక్షాలు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తుంటే కార్పొరేట్ మెడికల్ మాఫియా  ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాల కల్పనను తమకున్న పలుకుబడి, అర్ధబలం ఉపయోగించి అడ్డుకొంటు ప్రభుత్వ ఆసుపత్రులలో  వైద్య పరికరాలు లేని పరిస్థితి, వైద్యపరికరాలు ఉంటె, మందులు లేనటువంటి పరిస్థితి, ఈ రెండు ఉంటె అసలు డాక్టర్లే లేని పరిస్థితి తీసుకువచ్చి పేదవాడు బ్రతకాలి అంటే గత్యంతరం లేని పరిస్థితిలో కార్పొరేట్ ఆసుపత్రులపై ధారపడే పరిస్థితిని నేటి పాలకులు తీసుకువస్తున్నారని అన్నారు. ఈ రోజు ఈ మెడికల్ మాఫియా నిర్దారించిన రేట్లకే మందుల ధరలను ముద్రించి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకోవస్తున్నారని, ఒక రాష్ట్రంలో నిషేదించిన మందులను ఈ రాష్ట్రంలోకి తీసుకువచ్చి ప్యాకింగ్ మార్చి లక్ష రూపాయల మందులను 20 లక్షల రూపాయలకు బ్రాండ్స్ పేరుతో అమ్ముతూ సొమ్ము చేసుకోవడమే కాకుండా, నాసిరకం మందులు విచ్చలవిడిగా బహిరంగ మార్కెట్లో అందువాటులోకి వచ్చి ప్రజల ప్రాణాలతో చేగటం ఆడుతుంటే ఔషధ నియంత్రణ మండలి లంచాలతో నిద్రావస్థలో ఉన్నదా అని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఔషధ నియంత్రణ మండలి చట్టాలను పటిష్టముగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం తక్షమే స్పందించి రాష్ట్రా వ్యాప్తముగా జరుగుతన్న మెడికల్ మాఫియా పై సమగ్ర విచారం చేసి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.    

ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఛైర్మెన్ అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి మరియు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదరి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ & ఫార్మా మాఫియా పెట్రిగిపోతుందని ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా అక్రమ సంపాదనే ద్యేయంగా వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వందల,వేల కోట్ల రూపాయలను వైద్యం పేరుతో ప్రజల నుంచి దోచుకుంటున్నారని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో కూడా మాఫియా కనీస మానవతా దృక్పధం కూడా లేకుండా ఇష్టారాజ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వేల కోట్ల రూపాయల వ్యాపారం చేశారన్న విషయం ఏ ఒక్కరు మర్చిపోలేదని అన్నారు. చిన్న,చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా వారి మెదడులోకి భయాన్ని చోపించి వివిధ వైద్య పరీక్షల పేరుతో వేల రూపాయలను వారి పరీక్ష కేంద్రల ద్వారా దోచుకుంటున్నారని. ఇక రోగి వైద్య చికిత్స సమయంలో వారి ఫార్మా రక్కసి కోరలు చాస్తుందని ప్రజల భయాన్ని, బలంగా చేసుకొని 100 రూపాయల మందులను వేల రూపాయలకు అమ్ముతున్న ఏమి చేయాలని పరిస్థితికి నేడు నెలకొన్నదని అన్నారు. ఔషధ నియంత్రణ మండలి మరియు పోలీసు శాఖ సంయుక్తముగా రాష్ట్ర వ్యాప్తముగా ఆపరేషన్ గరుడ పేరుతో హడావిడి చేసి రాష్ట్రము అన్ని జిల్లాలో సుమారు 200 వరకు ఫార్మా దుకాణాలపై మరియు సంస్థలపై దాడులు నిర్వహించారు. దానిపై ఎటువంటి విచారం చేసారు, వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం వెంటనే శ్వేతా పత్రం విడుదల చేయలని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు బుట్టి రాయప్ప, మూలి సాంబశివరావు, తాడి పైడయ్య, పంచదార్ల దుర్గంబ, అప్పూరుబోతు రాము, కొట్టు రమణారావు, డి.వి.రమణబాబు, తూనం వీరయ్య, కొడాలి ఆనందరావు,లంకా గోవిందరాజులు, ఎస్.కె.నజీర్, కౌలు రైతు సంఘం నేత జమలయ్య, దళిత హక్కుల నేత కరవాది సుబ్బారావు, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల వలరాజు, ఉపాధ్యక్షుడు ఎం.సాయి కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు చంద్ర నాయక్, ఆర్.పిచ్చయ్య, నగర మహిళా సమాఖ్య నాయకులు దుర్గాసి రమణమ్మ, మూలి ఇందిరా, షైనీ, పుష్ప, ఏఐటీయూసీ నాయకులు జాన్సన్ బాబు, కె.ఆర్. ఆంజనేయులు,చీర్ల రామస్వామి, గూడేల జనార్దన్, మల్లేశ్వరి, మారుతీ సిపిఐ నగర నాయకులు ఐ ఆంజనేయులు కొండేటి శ్రీనివాస రావు, పడాల కనకారావు, కొండపల్లి క్రిష్ణ, పి.తాతారావు,మూలి శివన్నారాయణ, ఆర్.మైఖేల్, కరోతి వెంకటేశ్వరరావు, రాయన గుర్నాధం, మురుగేషన్ రాము, పగిడికత్తుల రాము, గాడి రాము, గాడి దుర్గారావు, జి రవికుమార్, శివ, సింగంశెట్టి మోహన్ ప్రసాద్, శ్రీరo రవికుమార్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top