ప్రభుత్వ పాఠశాలలో అక్షర అభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ జగన్

TEJA NEWS

ప్రభుత్వ పాఠశాలలో అక్షర అభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ జగన్ …

జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని రింగుబస్తీ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన బడిబాట అక్షర అభ్యాసం కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతనంగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల, ఉపాధ్యాయులు రేఖ, సుష్మ, జితేందర్, షణ్ముఖ నాయకులు పాపయ్య గౌడ్. మల్లారెడ్డి.ch మహేందర్ రెడ్డి హనుమంతు. యాదగిరి. వెంకటేష్ .బసవేశ్వర్. సంపత్ రెడ్డి. సిద్ధులు. శాంతి. ఝాన్సీ. తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top