డివిజన్ అభివృద్దే ప్రధాన లక్ష్యం.. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .
శేరిలింగంపల్లి డివిజన్ లోగల పాపిరెడ్డి కాలనీలో డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ.. సుమారు రూ. 1 కోటి పైచిలుకు రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో కలిసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .
ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. డివిజన్ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన అభివృద్ధి పనులకు రూపకల్పన చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్ ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉంటూ.. ప్రజలతో మమేకమై పనిచేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులు జనరల్ మేనేజర్ ఆర్ కృష్ణ, డీజిఎం నరేందర్, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, అధ్యక్షులు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ రామ్ బాబు, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, లింగ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు చాంద్ పాషా, హుస్సేన్, కుమార్, యోగి, ఎల్లయ్య, సునీల్, సుబ్బు, సిద్ధూ, శీను, నర్సింహా, కొండల్ రావు, మోహన్ మల్లేష్, జిహెచ్ఎంసీ సిబ్బంది మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
