వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ ఆశా నగర్ హైటెన్సన్ లైన్ రోడ్డు లోని నూతనంగా నిర్మిస్తున్న వర్షపు నీటి కాలువ (బాక్స్ డ్రైన్) నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వర్షపు నీటి కాలువ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు తెలియచేసారు. అలాగే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డ్రైనేజీ నిర్మాణ పనులను ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో గోపాల్, లింగం, సుధాకర్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
