మాదకద్రవ్యాల విక్రయాన్ని అరికడదాం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
జగద్గిరిగుట్ట లో మాదకద్రవ్యాల విక్రయాన్ని అడ్డుకొని గంజాయి లేని జగద్గిరిగుట్టను నిర్మించాలని కోరుతూ నేడు జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయం వద్ద కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ మండల కార్యదర్శి కె స్వామిలు, సీనియర్ నాయకులు ఏసురత్నం పాల్గొని నేడు సమాజంలో ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా సమాజంలో అలజడి సృష్టిస్తూ సమాజంలో ప్రశాంతికి అభద్రతకు కారణం అవుతున్న నేపథ్యంలో జగద్గిరిగుట్ట ప్రాంతంలో మాదకద్రవ్యాలను అమ్మడాన్ని అడ్డుకోవడానికి జగద్గిరిగుట్టలోని అన్ని బస్తీల బస్తి పెద్దలు బస్తీ కమిటీ సభ్యులు ప్రజలు కలిసి రావాలని కోరుతూ ఈనెల 11 నాడు జగద్గిరిగుట్టలో పార్టీలకతీతంగా అందర్నీ కలుపుకొని పోయి ఒక సమావేశన్ని నిర్వహిస్తున్నామని కావున ప్రతి సమావేశానికి అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరడం జరిగింది.
ఈనెల 11న జరగబోయే సమావేశానికి అందర్నీ ఆహ్వానించడానికి రేపటి నుంచి కార్యక్రమాలను మొదలుపెడతామని దీంతోనైనా జగద్గిరిగుట్టలో మాదకద్రవ్యాలను అరికట్టవచ్చని ప్రజల భవిష్యత్తును కాపాడుకోవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి అధ్యక్షుడు ప్రవీణ్, బాబు ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, సిపిఐ కోశాధికారి సదానందం, దుర్గయ్య, కే వెంకటేష్, సహదేవ్ రెడ్డి, యువజన నాయకులు కీర్తి, జంబు, చంద్రకాంత్, నారాయణ మేస్త్రి, ఇమామ్, మైనారిటీ నాయకులు హమీద్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.
