ప్రియమైన నాన్నా…హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించండి…

TEJA NEWS

ప్రియమైన నాన్నా…హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించండి…

విద్యార్థుల భావోద్వేగ పోస్ట్ కార్డ్ లేఖలతో రోడ్డు భద్రతపై చైతన్యం…

-వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి….

పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ (అరైవ్ -అలైవ్ కార్యక్రమం లో భాగంగా, ఈరోజు విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై, ట్రాఫిక్ నిబంధనలపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టబడింది.

ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విద్యార్థులు వారి ప్రియమైన నాన్నగారికి, రోడుపై చాలా ప్రమాదాలు అవుతాయి. “నాన్న హెల్మెట్ ధరించు మాకు తీసుకొనిరా, నాకు ఇంకా అమ్మకు కూడా హెల్మెట్ తీసుకు రా” అని లేఖల ద్వారా విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top