ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన

TEJA NEWS

ఘనంగా జ్ఞాన సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన.


కోదాడ పట్టణంలోని ఆజాద్ నగర్ లో గల స్థానిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మాతృదేవోభవ ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ బాబు , వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి, పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు లు ముఖ్య అతిథిలుగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా దేవత అయిన సరస్వతి దేవి విగ్రహన్ని పాఠశాలలో ప్రతిష్ఠించడం విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తిని పెంచుతుందని తెలిపారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాతృదేవోభవ ఛారిటబుల్ సొసైటీ సభ్యులను, విగ్రహ దాత దేవరశెట్టి సొమ్మమ్మ జ్ఞాపకార్ధం కుమారుడు దేవరశెట్టి లక్ష్మి నారాయణ , పుష్పవతి లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ స్వప్న, ఆర్యవైశ్య పెద్దలు పైడిమర్రి వెంకటనారాయణ, ట్రస్ట్ అధ్యక్షులు పబ్బా గీత,దేవి, వెంకటేశ్వర్లు,సెక్రటరీ ఓరుగంటి రమా, వెంకటేశ్వర్లు,కోశాధికారి యాద రాణి,శ్రీనివాసరావు,బొగ్గారాపు రేఖ రామ్మూర్తి,మంజుల, ఆంజనేయులు యాద శ్రీనివాసరావు,ఓరుగంటి దీపిక,ధనలక్ష్మి, ఇమ్మడి సంధ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top