రేవంతన్న నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధి

TEJA NEWS

రేవంతన్న నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకుంది — మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారీ కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు..

అనంతరం పలు ఆహ్వానాలు,వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..

— అనునిత్యం అణగారిన వర్గాల అభివృద్ధికి అండగా ఉంటానని అలాగే నియోజకవర్గంలో స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గణనీయంగా అభివృద్ధి చెందుతుందాన్నారు..

— తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు..

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, సంక్షేమ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top