తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల : ఏపీలో వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య నాలుగు రోజులుగా పెరిగింది. ఫలితంగా ఆదివారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2, నారాయణగిరి షెడ్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటలు పడుతోంది. గత మూడు రోజుల్లో దాదాపు 2.5 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, శనివారం ఒక్కరోజే 90,211 మంది దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
