పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారాల పంపిణీ

TEJA NEWS

పదవ తరగతి ప్రతిభావంతులకు నగదు పురస్కారాల పంపిణీ
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థినీ విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు..

పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక స్థైర్యం పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించడంతోపాటు.. పరీక్ష సామాగ్రి సైతం అందించడం జరుగుతోందని తెలిపారు. అదే విధంగా.. ఫలితాల్లో అత్యుత్తమ మార్పులు సాధించిన విద్యార్థులను సైతం ప్రోత్సహించాలన్న లక్ష్యంతో నగదు పురస్కారాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థినీ విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.. విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పాండురంగం రాథోడ్, నాగేశ్వరరావు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top