మీ డబ్బు – మీ హక్కు గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి,
మీ డబ్బు- మీ హక్కు అనే నినాదం తో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు అన్నారు.
బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ మౌర్య తో కలిసి మీ డబ్బు- మీ హక్కు గోడ పత్రికను జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని లేదా మరిచిపోయిన ఆర్ధిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పించబడుతుందన్నారు. ప్రజలు బ్యాంకులో డిపాజిట్స్ చేయడం , షేర్స్ , బీమా పాలసీలు మరియు ఇతర ఆర్థిక సాధనాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తమ కుటుంబ భవిష్యత్తును సురక్షితం చేసుకుంటున్నారు అని , అయితే కొన్ని సందర్భాలలో ఈ ఆస్తులు పరిపక్వతకు వచ్చిన తరువాత లబ్ధి దారులకు చేరకపోవడానికి ఖాతాదారుల మరణం , చిరునామా మార్పు లేదా నామినీ వివరాల లోపం వంటి కారణాలు ఉన్నాయి అని చెప్పారు. ఈ నేపద్యం లో భారత ప్రభుత్వ సమన్వయంతో 5 ప్రధాన ఆర్ధిక సంస్థలు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా , సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా , ఇన్సూరెన్సు రెగ్యులటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా , పెన్షన్ ఫండ్ రెగ్యులటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ మరియు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ కలిసి మూడు నెలల ప్రచారాన్ని ప్రాంభించాయని తెలిపారు . ఈ ప్రచారం ద్వారా పౌరులు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని నిధులను గుర్తించి సరి అయిన పత్రాలతో సులభం గా క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించబడుతుందని తెలిపారు.క్లెయిమ్ చేసుకొని నిధులను ఇప్పుడే క్లెయిమ్ చేసుకొని మరిచిపోయిన ఆర్ధిక ఆస్తులను కొత్త అవకాశాలుగా మార్చుకోవాలని బ్యాంకు వినియోగదారులకు సూచించారు. జిల్లా లో గత 10 సంవత్సరాలుగా బ్యాంకు ఖాతాలో ఏ విధమైన ఆర్థికలవదేవీలు జరపకుండా ఉన్నటువంటి ఖాతాలు మరియు ఖాతాలలో నిలవ ఉన్న నగదు వివరాలు
జిల్లా మొత్తం లో 5,50,632 ఖాతాలలో 112.42 కోట్లు నిల్వ ఉన్నదని అన్నారు.
ఈ కార్యక్రమ లో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి రవి కుమార్,ఏఎల్డీఎం మధుసూదన్ రెడ్డి,కలెక్టరేట్ యూనియన్ బ్యాంకు మేనేజర్ చంద్రప్రసాద్,పాల్గొన్నారు.
—– డి ఐ పి ఆర్ ఓ తిరుపతి —-
