మునిసిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణలో అధ్యక్ష, ఉపఅధ్యక్ష అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణా తరగతులు.

TEJA NEWS

మునిసిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణలో అధ్యక్ష, ఉపఅధ్యక్ష అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణా తరగతులు…

పెద్దపల్లి ; మునిసిపల్ సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్ టి పి సి కాకతీయ కల్యాణ మండపంలో జిల్లా స్థాయిలో అధ్యక్ష, ఉపఅధ్యక్ష అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ జె.అరుణశ్రీ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం లో శిక్షకులు కేడం శ్రీనివాస్, ఎన్. రాజేందర్ రెడ్డి,కె.కృష్ణా రెడ్డి, జి.అంజన్ కుమార్ లు పి ఓ లు , ఎ పి ఓ లు పోలింగ్ రోజు నిర్వర్తించాల్సిన విధుల గురించి అవగాహన కల్పించారు. పి. ఓ లు , ఎ పి ఓ లుగా అంతర్గాo, ధర్మారం, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, పాలకుర్తి ,పెద్దపల్లి, శ్రీరాంపూర్, సుల్తానాబాద్ తదితర మండలాలకు చెందిన ఉపాధ్యాయులను ఎంపిక చేసారు.

రామగుండం నగర పాలక సంస్థ నుండి 332 మంది ,పెద్దపల్లి మునిసిపల్ నుండి 89 మంది, ,మంథని మునిసిపల్ నుండి 31 మంది ,సుల్తానాబాద్ నుండి 36 మంది పి ఓ లుగా ఎంపిక కాగా ఉదయం పూట వారికి శిక్షణ ఇచ్చారు. అంతే మొత్తంలో ఉన్న అసిస్టెంట్ పి ఓ లకు మధ్యాహ్నం శిక్షణ ఇచ్చారు. మంథని ,పెద్దపల్లి,సుల్తానాబాద్ మునిసిపల్ కమిషనర్ లు మనోహర్, వెంకటేష్, రమేష్, నగర పాలక సంస్థ ఎస్ ఇ గురువీర, అసిస్టెంట్ కమీషనర్ వెంకటేశ్వర్లు, ఆర్.ఓ ఆంజనేయులు సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమo లో పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు కె. పద్మజా రాణి శిక్షణా శిబిరాన్ని సందర్శించారు.

You cannot copy content of this page

Scroll to Top