కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు

TEJA NEWS

కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టొద్దు

సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

వీధి కుక్కల బెడదపు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. వీధులు లేదా బహిరంగ ప్రదేశాలలో వీటికి ఆహారం అందించటం చట్టవిరుద్దమని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు నిర్దేశ ప్రాంతాలలోనే ఆహార అందించాలని ఇందుకోసం అధికారులు ప్రతి వార్డులలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఆ ప్రాంతాలలో మాత్రమే ఆహార అందించాలని సూచిస్తూ నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలని వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీధుల్లో కుక్కలకు ఆహారం ఇవ్వకూడదని, ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.సామాన్య పౌరులు వీధుల్లో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పద్ధతికి స్వస్తి పలకాలని అభిప్రాయపడింది.

You cannot copy content of this page

Scroll to Top