వర్ధన్నపేట మండలంలోని చెన్నారాము గ్రామములో దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన… మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య & పిఎసిఎస్ చైర్మన్ కన్నయ్య & మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం.
దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం, చెన్నారాము గ్రామములో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి దాన్యం కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మరియు పిఎసిఎస్ చైర్మన్ కన్నయ్య ,మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం గార్లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరతో పాటు, సన్నాలకు బోనస్ కూడా పొందాలని మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మరియు పిఏసిఎస్ చైర్మన్ కన్నయ్య,మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం లు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటుచేయబడిన ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు దొడ్డు రకం ధాన్యానికి 2300/- లకు అదేవిధంగా సన్న రకం ధాన్యాన్ని 2320/- కు కొనుగోలు చేయడంతో పాటు సన్నాలకు క్వింటాలుకు 500/- బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది కావున రైతులెవ్వరు మధ్యదళారులకు అమ్ముకోని మోసపోవద్దు ఐకెపి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని సూచించారు.
ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం 17% ఉండే విధంగా చూడాలని అలాగే 41 కేజీలతో మాత్రమే రైతుల నుంచి ఐకెపి కొనుగోలుదారులు కాంటాలు నిర్వహించాలని సూచించారు. 41 కేజీల కంటే అధిక తూకంతో కాంటాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని సూచించారు.
రైతులు ధాన్యం విక్రయించిన అనంతరం వాటిని తడవకుండా చూసుకునే బాధ్యత ఐకెపి కొనుగోలుదారులదేనని వారు అన్నారు. అదేవిధంగా ఖరీదు చేయబడిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలు ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి గోదాములకు తరలించాలని సూచించారు.
అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
అదేవిధంగా రాష్ట్రంలోని 43 లక్షల మంది రైతులకు 22 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీని చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.
రాష్ట్రంలో ఉన్న 90 లక్షల తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. అయినను పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు ఈ కార్యక్రమములో జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్,మాజీ సర్పంచ్ బర్ల బాబు,నియోజక వర్గ అధికార ప్రతినిధి బర్ల సహదేవ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బర్ల సతీష్,మాజీ సర్పంచ్ చెన్న. లక్ష్మి నారాయణ,పెండియాల భిక్ష పతి, అమరాజ్ స్వామి,లు పాల్గొన్నారు.
