వాస్తవాన్ని వక్రీకరించే వార్తలు వద్దు

TEJA NEWS

వాస్తవాన్ని వక్రీకరించే వార్తలు వద్దు

** మీడియాకు తిరుపతి పోలీసు శాఖ సూచన

తిరుపతి: వాస్తవాలను వక్రీకరణ చేసి చూపించే వార్తలకు మీడియా వాళ్ళు స్వస్తి పలకాలనీ…. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా పోలీసు అధికారులు హెచ్చరించారు. తిరుమలలో భక్తుల భద్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం… అవాస్తవాలు ప్రసారం చేయడం వల్ల భక్తుల్లో అపోహలు, భయం వ్యాపించే అవకాశముంది.
ఇలాంటి వదంతులను ఉద్దేశపూర్వకంగా వ్యాపింపజేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని పోలీస్ శాఖ పేర్కొంది. కొంతమంది మీడియా ఛానళ్లలో ప్రసారమైన గరుడ సేవ రోజు తిరుమలలో తొక్కిసలాట, భక్తుల అవస్థలు, గేట్లు ధ్వంసం, అస్వస్థత, బారికేడ్ నుంచి కింద పడిన పోలీస్ అధికారి ” వంటి కథనాలు పూర్తిగా నిరాధారమైనవి… అవాస్తవాలని పోలీసు శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది.

వాస్తవ పరిస్థితి

భక్తులు లేపాక్షి నుండి నందకం వైపు వెళ్తుండగా, వర్షం రావడం వల్ల ఒకేసారి రాంభగీచా మీదుగా మాడ వీధిలోకి రావడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసు సిబ్బంది సంయమనంతో, సమర్థవంతంగా భక్తులను నందకం వైపు మళ్లించారు.
ఎటువంటి తొక్కిసలాట, తోపులాట, గేట్ల ధ్వంసం, భక్తులకు గానీ…పోలీసులకు గానీ ఎలాంటి గాయాలు జరగలేదు. భక్తుల రద్దీ వలన యువతి స్వల్ప అస్వస్థకు గురయింది తప్ప ఎటువంటి తోపులాట లేదు

You cannot copy content of this page

Scroll to Top