డబుల్ ఇంజిన్ సర్కార్ లో డబుల్ డెవలప్ మెంట్ : ప్రత్తిపాటిసంక్షేమం

TEJA NEWS

’డబుల్ ఇంజిన్ సర్కార్ లో డబుల్ డెవలప్ మెంట్ : ప్రత్తిపాటి
సంక్షేమం.. అభివృద్ధిలో చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ విభిన్నమే: ఎంపీ లావు
….

రూ.20 లక్షలతో చేపట్టిన పార్క్ ఆధునికీకరణ పనులకు, రూ.23 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు.

కూటమి సమగ్రతను కాపాడుతూనే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఆయన నరసరావుపేట లోక్ సభ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలుతో కలిసి పట్టణంలో రూ.43 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుత పట్టణంలోని 6వ వార్డులోని బింగి రామ్మూర్తి పార్క్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఎంపీ లావు అనంతరం 7వ వార్డులో రూ.23 లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు, శంకుస్థాపన చేశారు. అనంతరం ఇరువరు నాయకులు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

డబుల్ ఇంజిన్ సర్కార్ తో ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం : ప్రత్తిపాటి
కూటమి పార్టీల పరస్పర సహకారం, సమన్వయం ప్రజలకు, రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తోందని, ఎన్డీయే ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే, భావితరాలకు ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ లో జరుగుతున్న డబుల్ స్పీడ్ డెవలప్ మెంట్, సమగ్ర పాలన వల్లే గత పాలకుల అసమర్థ పాలన.. కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించిందన్నారు.

సంక్షేమం అమల్లో చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ విభిన్నమే : ఎంపీ లావు
గత పాలకులు విస్మరించిన అభివృద్ధిని.. నేడు చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ ప్రజలకు మేలైన సంక్షేమం, సుస్థిర అభివృద్ధిని అందిస్తున్నారని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు.
మౌలిక వసతుల కల్పన, సంక్షేమంలో చంద్రబాబు ఆలోచనవిధానం ఎప్పుడూ విభిన్నమేనని, రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా.. ఆర్థిక కష్టాలున్నా లెక్కచేయకుండా ప్రజల సంతోషానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలు అనుసరించేలా, అసూయ చెందేలా, కూటమి ప్రభుత్వ సుపరిపాలన కొనసాగుతోందని ఎంపీ చెప్పారు.

కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, కామినేని సాయిబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, జిల్లా ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు ముద్దన నాగేశ్వరరావు, కొత్త కోటేశ్వరరావు, బేరింగ్ మౌలాలి, మురకొండ మల్లిబాబు, షేక్ బాజీ, రత్న రెడ్డి, అరె మల్లి, సుభాని, గుదే వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి, డిఇ అబ్దుల్ రహీమ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, అధికారులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top