బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ …
బార్ కౌన్సిల్ ఎన్నికల్లో చిలకలూరిపేట పోలింగ్ కేంద్రం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సుగాలి కాలనీ నందు తన ఓటు హక్కును వినియోగించుకున్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం, న్యాయవ్యవస్థ బలోపేతం మరియు పారదర్శక పరిపాలనకు బార్ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, న్యాయంగా నిర్వహించబడుతున్నందుకు నిర్వాహకులను అభినందించారు.ఒకవైపు శాసనమండలి సమావేశాలలో బిజీగా ఉంటూ ఆ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలు లేవనెత్తుతూ, మరోవైపు జరుగుతున్న బార్ కౌన్సిల్ ఎన్నికలలో పాల్గొని తన ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యం పట్ల మర్రి రాజశేఖర్ గారికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.
