మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక పరోక్ష విధానానికి సిద్ధం చేసుకోవాలని సూచించిన…….. ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
వనపర్తి జిల్లా
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ పరోక్ష విధానములో నిర్వహించే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో ఎక్స్ అఫిషియో ల మున్సిపాలిటీ ఎంపిక కొరకు నోటీసులు జారీ చేసి ఆప్షన్ తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు.
జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
పరోక్ష విధానం ద్వారా చేసే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, ఎమ్మెల్సీలు, రాజ్య సభ సభ్యులు ఎక్స్ అఫిషియో హోదాలో ఏదో ఒక మున్సిపాలిటీని ఎంచుకొని ఆప్షన్ ఇచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సెక్షన్ 5, 20 ప్రకారం ఎవరైనా ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్సీలు తాము ఎన్నికైన 30 రోజుల్లోపు ఏదో ఒక మున్సిపాలిటీకి ప్రాతినిధ్యం వహించేందుకు ఆప్షన్ ఇచ్చుకొని ఉండాలని, అలా కాకుండా ఇంతవరకు ఆప్షన్ ఇవ్వని పక్షంలో నిబంధన ప్రకారం మున్సిపల్ ఎన్నికలు అయిన 30 రోజుల్లో ఆప్షన్ ను సంబంధిత మున్సిపల్ కమిషనర్ కు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనికొరకు ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ జారి చేసి ప్రజాప్రతినిధుల నుండి ఆప్షన్ తీసుకోవాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు నిబంధనల ప్రకారం ఫిబ్రవరి, 11 నుండిl 14వ తేదీ లోపు నోటీస్ లు జారీ చేసి ఆప్షన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, డిఆర్డీఒ పి.డి. ఉమాదేవి, సి.పి. ఒ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ లు తదితరులు పాల్గొన్నారు.
