నూతన మాత్సకార గ్రామ కాపులు ఎన్నిక.
ఆవుల వాసు
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామచంద్రపురం పంచాయతీ రామచంద్రపురం గ్రామంలో నూతనంగా గ్రామ కాపుల ఎన్నిక జరిగింది. ఈ సందర్బంగా కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల వాసు ముఖ్య అతిధిగా పాల్గొని. గ్రామ కాపులకు నియమించిన పెద్ద కాపు వావిళ్ల రావణయ్య, రెండవ కాపు వావిళ్ళ కనకయ్య, మూడు కాపు శ్రీహరికోట తిరుపతి, క్యాషియర్ పామాంజి జయరామయ్య, వీరు అందరికి పూలమాలతో శాలువాలతో ఆవుల వాసు వారిని సత్కారించి శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ కాపులు మరియు గ్రామ పెద్దలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల వాసు కి శాలువా లతో సత్కారించారు.ప్రతి ఒక్కరూ కష్టపడి ముందుకెళ్లాలని కలిసి మెలిసి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు, మరియు గ్రామ పెద్దలు గ్రామస్తులు పాలుగోన్నారు.
