ప్రజా పక్షం దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మార్వో వాజిద్ అలీ…
కోదాడ : కోదాడ మండల కేంద్రంలో సోమవారం తాసిల్దార్ వాజిద్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ సంధ్యా రాణి, సీనియర్ అసిస్టెంట్ శైలజా, ఆర్ ఐ లు రాజేష్ , జగదీష్ , రికార్డు అసిస్టెంట్ అరవింద్ చేతుల మీదుగా ప్రజా పక్షం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు ప్రభుత్వానికి పత్రికలు వారధి లాగా ఉంటారని, పత్రికలు ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అందిస్తూ చట్టం పట్ల, సమాజం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పక్షం మండల రిపోర్టర్ గెల్లా పవన్ కుమార్,సాక్షిత రిపోర్టర్ అమెరబోయిన వీరబాబు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
