విద్యార్థుల కంటి ఆరోగ్యానికి భ‌రోసా

TEJA NEWS

విద్యార్థుల కంటి ఆరోగ్యానికి భ‌రోసా

  • ఉచితంగా కంటి ప‌రీక్ష‌లు, క‌ళ్ల‌ద్దాల పంపిణీ
  • కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్‌

ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వ ఎయిడెడ్ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన వారికి క‌ళ్ల‌ద్దాలు పంపిణీ చేస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు వ‌సంత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంధత్వ నివారణ సంఘం ద్వారా పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఇందులో భాగంగా జిల్లాలోని పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, మొత్తం 3,325 మంది విద్యార్థుల్లో దృష్టిలోపాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు అందించే కార్యక్రమంలో భాగంగా కొండపల్లి జెడ్పీ బాలికల పాఠశాలలో 65 మంది విద్యార్థులకు క‌లెక్ట‌ర్, శాస‌న‌స‌భ్యులు శ‌నివారం క‌ళ్ల‌ద్దాలు పంపిణీ చేశారు.
(డీఐపీఆర్‌వో, ఐ అండ్ పీఆర్‌, ఎన్‌టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

You cannot copy content of this page

Scroll to Top