TEJA NEWS

ఎన్నికల్లో ఓడినా… మనసున్న మనిషిగా గెలిచిన శంకరాచారి
…..

నల్గొండ: ఎన్నికల్లో ఓటమి ఎదురైనా ప్రజాసేవ పట్ల తన నిబద్ధతను చాటుతూ బీజేపీ నేత శంకరాచారి మరోసారి తన గొప్ప మనసును నిరూపించారు. చిట్యాల మండలం నేరడ గ్రామంలో ఇటీవల మృతి చెందిన వడ్డేపల్లి గోపాల్‌కు ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆయన స్వయంగా రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించి, అవసరమైతే ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఎన్నికల ఫలితాలు ఏవైనా సరే, ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండాలనే భావనతో శంకరాచారి చేసిన ఈ చర్య గ్రామస్తుల మనసులను గెలుచుకుంది. ఇటీవల జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ, తన రాజకీయ బాధ్యతలకే పరిమితం కాకుండా మానవతా విలువలకు పెద్దపీట వేయడం ఆయన ప్రత్యేకతగా గ్రామస్తులు పేర్కొన్నారు. ఓడిన తర్వాత కూడా గ్రామ అభివృద్ధి, ప్రజాసేవల పట్ల అదే ఉత్సాహంతో ముందుకు సాగడం నిజమైన నాయకత్వానికి నిదర్శనమని పలువురు అభిప్రాయపడ్డారు.
“పదవులు రావచ్చు, పోవచ్చు… కానీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడమే నిజమైన విజయం” అన్నట్లుగా శంకరాచారి వ్యవహారం ఉందని గ్రామ పెద్దలు ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ, మనసున్న మనిషిగా ప్రజల ప్రేమను, గౌరవాన్ని గెలుచుకున్న శంకరాచారి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.