శ్రమదానం ద్వారా ప్రతి వీధి పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలి………. ఎమ్మెల్యే మెగా రెడ్డి
వనపర్తి
వనపర్తి జిల్లా
*ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా వనపర్తి మున్సిపాలిటీలోని ప్రతి వీధి పరిశుభ్రం అయ్యే విధంగా రోజుకో వీధిలో శ్రమదానం ద్వారా పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మొదటి థీమ్ అయిన పరిశుభ్రత, ఫైళ్ళ క్లియరెన్స్ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా అధికారులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్థానిక శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్. ఖీమ్య నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, జిల్లా అధికారులు పారలు, తట్టలు పట్టుకొని చెత్తను తొలగించి శుబ్రం చేసారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ మార్చి, 6 నుండి 15 వరకు నిర్వహించే పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని అన్ని వీధులు, వార్డులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలు పరిశుభ్రం చేసే కార్యక్రమాలు నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ 99 రోజుల కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరు తమ ఇల్లు, తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా కృషి చేయాలని తద్వారా రాబోయే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ఈ పది రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తమ పరిసరాలను, కార్యాలయాల లోపల పరిశుభ్రంగా చేసుకోవాలని, అంతేకాకుండా కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న ఫైళ్లు యుద్ధప్రాతిపదికన పరిష్కరించి అట్టి సమాచారాన్ని సంబంధిత లబ్ధిదారులకు తెలియపరచే విధంగా అధికారులను ఆదేశించినట్లు తెలియజేశారు.
కార్యాలయాల్లో చేపట్టిన కార్యక్రమాలు ఏ రోజుకు ఆరోజు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
జడ్పీ సి.ఈ.ఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు , కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.
