చెత్త రహిత రామగుండoగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.

TEJA NEWS

చెత్త రహిత రామగుండoగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి…..

ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్…

పెద్దపల్లి //రామగుండం చెత్త రహిత రామగుండo గా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం శాసన సభ్యులు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఆవరణలో 5 కె రన్ ను మేయర్ మహంకాళి స్వామి తో కలిసి పచ్చ జెండా ఊపి ఆయన ప్రారంభించారు. నగర పాలక సంస్థ కార్యాలయం నుండి గోదావరిఖని చౌరస్తా వరకు రన్ నిర్వహించారు. చౌరస్తాలో మానవ హారం నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… రెండేళ్ల కాలంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక అభివృద్ది కార్యక్రమాలు , సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాజకీయాలకు అతీతతంగా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నదని అన్నారు.

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక ప్రదాన ఉద్దేశ్యం ఈ నగరాన్ని పరిశుభ్రమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దుకోవడమని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పచ్చదనం , ల్యాండ్ స్కేప్ లతో అందంగా రూపొందించుకోవాలని అన్నారు.

మహిళా సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చిత్త శుద్దితో అమలు చేస్తుందని అన్నారు. స్వంత వ్యాపారం పెట్టుకునే స్వశక్తి సంఘాలకు కోట్లాది రూపాయల సబ్సిడీ రుణం ఇస్తూ ప్రోత్సాహిస్తుందని అన్నారు. అలాగే ప్రభుత్వ రంగంలో లక్ష ఉద్యోగాలు , ప్రైవేటు రంగం లో రెండు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు తమ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు.

రామగుండం నగర పునర్నిర్మాణం జరుగుతున్నదని ఇందులో భాగంగా రోడ్ల వెడల్పుతో పాటు వాణిజ్య భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతుందని అన్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో కనీ వినీ ఎరుగని విధంగా అన్ని రంగాల్లో రామగుండం అభివృద్ది చెంది ఇతర ప్రాంతాల వారు ఆకర్షితులయ్యే విధంగా రూపు దిద్దుకుంటుందని అన్నారు.

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయడంలో తమ వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తామని హాజరై న వారితో మేయర్ మహంకాళి స్వామి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ పాలక వర్గం సానిటేషన్ కు ప్రధమ ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ప్రజలు కూడా సహకరించి చెత్త బయట పడ వేయకుండా నగర పాలక సంస్థ స్వచ్చ వాహనాలకే అందివ్వాలని అన్నారు.. చెత్త బయట పడవేసి ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించేవారికి జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు.ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో సుమారు 800 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది పనులు జరుగుతున్న క్రమంలో, రామగుండం నగర రూపు రేఖలు త్వరలో మారనున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య , పలువురు కార్పొరేటర్ లతో పాటు నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఎస్ ఇ గురువీర , ఇ ఇ. పి వి రామన్ , ఎ సి పి శ్రీహరి , టి పి ఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ , సి డి పి ఓ అలేఖ్య పటేల్ , వన్ టౌన్ సి ఐ ఇంద్ర సేనా రెడ్డి , మెప్మా సిబ్బంది , తో పాటు ఎన్ సి సి , ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు , కమాoడెంట్లు తిరుపతి , కేడమ్ శ్రీనివాస్ , నగర పాలక సంస్థ సంస్థ ఉద్యోగులు, వాకర్స్ అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాసన సభ్యులు ఎం.ఎస్.రాజ్ ఠాకూర్ , మేయర్ మహంకాళి స్వామి ఆద్యంతం పరుగెడుతూ అందరినీ ఉత్సాహ పరిచారు.

You cannot copy content of this page

Scroll to Top