ప్రతి ఒక్కరికీ సొంతిల్లు నినాదం ఎన్టీఆర్ ది…
** దాన్ని నెరవేరుస్తున్న విధానం చంద్రబాబు ది
చిత్తూరు: ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే నినాదం స్వర్గీయ ఎన్టీ రామారావుది అయితే…. ఇప్పుడు దాన్ని
నెరవేరుస్తున్న విధానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆయన చిత్తూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
“పేదల సేవలో కూటమి ప్రభుత్వం…నెరవేరనున్న పేదల సొంతింటి కల” అనే నినాదంతో ఈ రోజు పేదల సొంతింటి కల సాకారమవుతున్న చారిత్రాత్మక రోజు అని తెలిపారు. సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
2014-19లో పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు పట్టణాల్లో 1.5 సెంట్లు, గ్రామాల్లో 2 సెంట్లు ఇచ్చి
పేదల అండగా చంద్రబాబు నిలిస్తే దాన్ని సెంటుకే కుదించి పేదల ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి
నిలిచిపోయాడు.
2014-19లో టిడ్కోతో కలిపి 12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందిస్తే జగన్ రెడ్డి మాత్రం
ప్రచార ఆర్భాటం తప్పించి పేదలకు గృహాలను పూర్తి చేసి ఇచ్చింది లేదు.
ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్
లబ్ధిదారులకు రూ.920 కోట్ల బకాయిలనూ చెల్లించకుండా నిలిపి వేశాడు. “ఇళ్లు కాదు, ఊళ్లే నిర్మిస్తాం” అని చెప్పి రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఏవి కల్పించకుండానే
పెండింగ్ లోనే ఉన్న కొన్ని ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి చేతులు దులుపుకున్న ఘనుడు జగన్ అని ఆరోపించారు. అయితే
నేడు కూటమి ప్రభుత్వం ఇళ్లతో పాటు రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక
సదుపాయాలు కల్పించి ప్రజలకు అందిస్తుంది.
సమగ్ర గృహ నిర్మాణం – అభివృద్ధికి మరో సోపానం
పేదవాళ్లు కూడా సౌకర్యవంతమైన ఇంటిలో జీవించాలనే సదుద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో 3
సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. పేద,
మధ్య తరగతి వారి కోసం రూ.2.50 లక్షలు ఇంటి నిర్మాణానికి అందజేయనుంది. ప్రధాని ఆవాస్ యోజన 2.0 మొదటి విడతలో భాగంగా 40,410 గృహాలను రూ.1,010 కోట్లతో ప్రభుత్వం
మంజూరు చేసింది. అందుకు గాను వాటికి ఇవాళ అట్టహాసంగా భూమి పూజలు చేస్తున్నాం.
పేదల నుంచి ఇంకా దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తూనే ఉంది.
వారికి కూడా ఇళ్లు మంజూరు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే వారికి కూడా
ఇళ్లు నిర్మించే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది.
2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతిళ్లు కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం. సెంటు పట్టా పేరుతో జగన్ రెడ్డి దోపిడీ పర్వం చేస్తే
పేదలందరికీ ఇళ్లు ఇస్తానని చెప్పి సెంటు పట్టా పేరుతో జగన్ రెడ్డి భారీ దోపిడికి తెర లేపాడు. పేదవాడి ఇంటికి సెంటు ఇచ్చి తాను మాత్రం విలాసవంతమైన ప్యాలెస్లో సేవదీరేవాడు. గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు. జగనన్న లే అవుట్లు నిర్ణయించక ముందే వైసీపీ నేతలు ఆ భూములను బినామీ పేర్ల మీద కొని తిరిగి ప్రభుత్వానికే 3 రెట్లు ఎక్కువ ధరతో అమ్మి కోట్లకు పడగలెత్తారు.
ఈ రకంగా సెంటు పట్టా పేరుతో జగన్ ముఠా రూ.7,500 కోట్లు దోచుకున్నారు.
టిడిపి పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను కూడా పేదలకు ఇవ్వకుండా వాటిని తాకట్టు పెట్టి పేదలను అప్పుల
ఊబిలోకి నెట్టాడు.
ఈ రోజు ప్రభుత్వం అందించిన స్వంత ఇళ్లకు గృహ ప్రవేశములు చేసిన 3 లక్షల లబ్ధిదారులకు తెలుగుదేశం పార్టీ తరపున అభినందనలు .
