చనిపోయిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత

TEJA NEWS

చనిపోయిన హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూత

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో మరణించిన హోంగార్డులు
డి.తిరుపతి(801), ఎం.రాములు(272)లకు తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున మంజూరైన చెక్కులను అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్ వారి కార్యాలయంలో హోంగార్డుల కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్,ఏఆర్ ఏసీపీ ప్రతాప్, హోంగార్డ్స్ ఆర్‌ఐ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top