ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి

TEJA NEWS

ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అనుమతి!

హైద‌రాబాద్ : తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు ఊరట కల్పించింది.ఈసారి కూడా పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యం గా వచ్చిన విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించాలని నిర్ణయించింది.

గతేడాది అమలు చేసిన ఈ నిబంధననే ఈసారి కూడా కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరగనున్నాయి.ఈ పరీక్షలకు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజులు చెల్లించారు. అంతకుముందు రేపు,ఎల్లుండి ఇంగ్లిష్ ప్రాక్టికల్స్,23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్,24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహిస్తారు.ఇక,ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ఇతర ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.

You cannot copy content of this page

Scroll to Top