అవగాహన లేనివారికి మున్సిపల్ చైర్మన్ పదవి సీల్డ్ కవరే ప్రామాణికం
కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిన చీర్ల రజిని చందర్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా అందజేస్తామన్న మాజీ పట్టణ అధ్యక్షులు చిర్లచందర్
తమ దృష్టి కి రాలేదన్న పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేన రెడ్డి
వనపర్తి
చైర్మన్ పదవి దక్కలేదన్న వేదనతో నూతనంగా గెలుపొందిన మూడో వార్డు కౌన్సిలర్ చీర్ల రజిని చందర్ కౌన్సిలర్ పదవికి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో సుబ్రహ్మణ్యానికి రాజీనామా పత్రాన్ని అందజేసి కౌన్సిల్ హాల్ నుంచి బయటికి వెళ్లిపోయారు అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ చీర్ల చందర్ తో కలిసి చీర్ల రజిని మీడియాతో మాట్లాడుతూ 30, 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన దివంగత చీర కృష్ణయ్య కుటుంబ వారసులమైన తాము నేటికీ కాంగ్రెస్ పార్టీ నే నమ్ముకుని ఇంతకాలం కొనసాగిస్తూనే ఉన్నామని తమ కుటుంబంలో ఒకసారి చీల కృష్ణయ్య భార్య కౌన్సిలర్ గా కొనసాగారని ఆ తర్వాత తాను కూడా (చీర్ల చందర్) కౌన్సిలర్ పదవిని అలాగే కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులుగా బాధ్యతలను చేపట్టడం జరిగిందని ఇప్పుడు చీరల రజిని అదే పార్టీ నుండి గెలుపొందడం జరిగిందని అలాంటి సుదీర్ఘమైన రాజకీయ మున్సి పాలనపై పూర్తి అవగాహన ఉన్న తమలాంటి వారికి కాకుండా ఓ ముగ్గురు వ్యక్తుల కుట్రవల్లె చీర్ల రజినికి చైర్మన్ పదవి లభించలేదని మున్సిపాలిటీ పాలనపై అవగాహన ఉన్న తమలాంటి వాళ్లకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తే వారి ఆటలు సాగవని అందుకే సీల్డ్ కవర్ రాజకీయాలకు తెర తీశారని అవగాహన లేని వారికి చైర్మన్ వైస్ చైర్మన్ పదవులను కట్టబెట్టారని చీర్ల రజిని, చందర్‌లు ఆరోపించారు అవగాహన లేని వారిని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టి సదరు వ్యక్తులు వెనక నుండి పాలన( చక్రం) కొనసాగించే విధంగా వ్యూహరచన చేశారని మీడియా ముందు బాహాటంగా ఆరోపించారు వీరి కుట్రలు భరించలేక రాజీనామా చేశామని పార్టీకి కూడా రేపు మాపుజిల్లా కార్యాలయంలో రాజీనామా అందజేయనున్నట్లు తెలుపుతూ కేవలం వనపర్తి మున్సిపాలిటీ జనరల్ కావడం ఒక ఓసి వ్యక్తి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ కు చైర్మన్ పదవిని కట్టబెట్టేందు జరిగిన కుట్రని ఇకపై పార్టీకి రాజీనామా అనంతరం బీసీల పక్షాన నిలబడి బీసీల కోసం ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా చీర చందర్ తెలిపారు
డిసిసి అధ్యక్షులు శివసేన రెడ్డి వనపర్తి మున్సిపల్ పోరు గెలుపుపై రాష్ట్ర క్రీడా శాఖ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షులు శివసేన రెడ్డి మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ను గ్రహించిన ప్రజలు రాష్ట్రంలో అత్యధికంగా మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారని ప్రజలందరికీ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏ అధికారంలో కొనసాగుతారని జోష్యం పలికారు చీర్ల రజిని రాజీనామా పై పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ తమ దృష్టికి రాలేదని ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే కూర్చోబెట్టి మాట్లాడి రాజీనామాను వెనుక తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటామని లేని పక్షంలో వారిని పార్టీ నుండి వైదొలగిస్తామని తెలిపారు ఇదే విషయం పై చీర్ల రజిని చందర్‌లు వివరణ ఇస్తూ ఆశావాహులందరినీ కూర్చోబెట్టి ముందే చర్చలు జరిపి ఉంటే బాగుండేదని అంతా అయిపోయాక ఇప్పుడు మాట్లాడడం దేనికని తిరిగి ప్రశ్నించారు తనతోపాటు మరికొందరు రాజీనామా చేసే అవకాశం ఉందని వారు తెలపడం విశేషం నూతనంగా కొలువుదీరిన పురపాలన లో ఏం జరుగుతుందో పట్టణ ప్రజలు వేచి చూడాల్సిందే మరి.
