మాజీ ఏఎంసీ చైర్మన్ ఘనశ్యాం ను పరామర్శించిన దారపనేని
కనిగిరి : ప్రకాశం జిల్లా ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నాయకులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అనుచరులు, చిన్ననాటి స్నేహితులు అయినటువంటి అయినా బత్తిని ఘనశ్యాం ను కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పరామర్శించారు. ఇటీవల హృదయానికి సంబంధించిన వ్యాధితో కొంత అస్వస్థతకు గురైన ఘనశ్యాం చెన్నైలోని అపోలో హాస్పటల్లో మెరుగైన వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చిన ఘన శ్యాం ను దారపనేని ఒంగోలులోని ఘన శ్యాం నివాసంలో పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దారపనేని మాట్లాడుతూ ఆరోగ్యం పై అశ్రద్ధ విడనాడి ఆరోగ్యవంతులుగా ఉండేందుకు కృషి చేయాలన్నారు. వరద నాగేశ్వరరావు స్వామి, తదితర మిత్రులు, శ్రేయోభిలాషులు పరామర్శించిన వారిలో ఉన్నారు.
